దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలి
బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బోనకల్లు, జూన్ 19 : బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మడుపల్లి వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితం ఆటోలో వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెద్దప్రోలు సైదులు, అతడి కుమారుడు కార్తీక్‌లు ఆటోను ఆపి ఇనుప రాడ్‌తో వెంకటేశ్వర్లుపై దాడి చేశారు.
దీంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిపై ప్రశ్నించిన వెంకటేశ్వర్లు తల్లి రాధమ్మపై కూడా దాడికి దిగడంతో కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు వారిని పిలిపించి విచారణ చేపట్టలేదని బాధితులు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, బాధిత కుటుంబ సభ్యులు గురువారం బోనకల్లు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. కాంగ్రెస్ నాయకులతో తమకు ప్రాణభయం ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఎస్సై వెంకన్నను వేడుకున్నారు.
పూర్తిస్థాయి విచారణ చేసి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వంగాల కృష్ణ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు, అతడి తల్లిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వంగాల సీత, బీఆర్ఎస్ నాయకులు రామిశెట్టి రవికుమార్, గుడిద శ్రీరామ్, ఎనమద్ది శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

