Golden Jubli Celebrations | మధిర: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం వేడుకలు త్వరలో జరుగనున్నాయి. ఇందుకోసం పూర్వ విద్యార్థులతో ఆదివారం సన్నాహాక సమావేశం జరిగింది. మధిరలోని టీవీఎం స్కూల్లో స్వర్ణోత్సవ వేడుకల కార్యాచరణపై చర్చించారు. 1970 నుంచి 2000 వరకు చదువుకున్న విద్యార్థులకు కళాశాల స్వర్ణోత్సవాల గురించి తెలిపి ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
సన్నాహక సమావేశానికి హాజరైన వారితోపాటు సమాచారం తెలియని వారికి తెలిపి, సమిష్టిగా కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి బాధ్యతగా వ్యవహరించాలని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మొండితోక జయకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, అద్దంకి విప్లవ కుమార్, కరివేద వెంకటేశ్వరరావు, బోజడ్ల అప్పారావు, రేగళ్ల సాంబశివరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కొర్లపాటి మాధవరావు, మంకెన నాగేశ్వరరావు, సీతారాములు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.