మామిళ్లగూడెం, మార్చి 1: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతుల పంటలను అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం వ్యవసాయ మారెట్లో శుక్రవారం జరిగిన రైతుల ధర్నా గురించి తెలుసుకున్న ఆయన.. మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయితో ఆ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారెట్లలో రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు. మారెటింగ్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఇలాంటి ఘటనలకు తావులేకుండా, పురరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం, రైతుల ధర్నా, ఆందోళన గురించి మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి.. మంత్రికి వివరించారు.