ఇల్లెందు/ దమ్మపేట, మార్చి 23 : తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది.
ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి, ఇందిరాపార్కు వద్ద ధర్నాకు బయలుదేరిన ఇల్లెందు, దమ్మపేట మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలను, మధ్యాహ్న భోజన కార్మికులను, సీఐటీయూ నాయకులను ఆదివారం ఉదయమే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.