కారేపల్లి, డిసెంబర్ 12 : సింగరేణి మండలంలోని కారేపల్లి క్రాస్ రోడ్, చీమలపాడు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు ఏఈలు జి.ప్రీతి, డి.రాజేశ్వరి తెలిపారు. సబ్ స్టేషన్ల మరమ్మతుల దృష్ట్యా కారేపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అలాగే చీమలపాడు సబ్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.