పాల్వంచ/ మణుగూరు టౌన్/ భద్రాచలం, ఆగస్టు 3 : తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్‌లో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు సోమవారం 35వ రోజుకు చేరాయి. వైటీపీఎస్‌లోని రెండ్లు ప్లాంట్లలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో, మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట, భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నల్లబాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు.
విద్యుత్ సంస్థల్లో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్వంచలో రాజేందర్, యాస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మడకం శ్రీనివాసరావు, మణుగూరులో నరేశ్, మహేశ్, ప్రసాద్, వెంకట్రాం, శోభన్, వరుణ్, భద్రాచలంలో జీవన్‌కుమార్, నర్సింహారావు, వెంకట్రాజు, రామకృష్ణ, ఉదయ్, కేటీఎన్ మూర్తి, సత్యనారాయణ, ప్రవీణ్, రోహిణి, జ్యోతి, ఉపేందర్, రాజారావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.