కారేపల్లి,డిసెంబర్ 17 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 60.09 పోలింగ్ శాతం నమోదయింది. మొత్తం 20,429 పురుషులకు గాను 11,528 మంది,21,365 స్త్రీలకు గాను 13,586 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్‌కు మరికొద్ది సమయము మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లు పోలింగ్ బూతుల వద్దకు బారులు తీరారు. ఒంటిగంట కంటే ముందుగా పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలోకి చేరుకున్న వారికి ఎలక్షన్ ముగిసేవరకు అధికారులు అవకాశం ఇవ్వనున్నారు.
