పాల్వంచ కేంద్రంగా దొంగ నోట్ల ముద్రణ
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అక్కడి పోలీసులు పట్టుకుని విచారించారు.
- – ఏపీలో పట్టుబడిన ముఠా
పాల్వంచ, మార్చి 16: పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అక్కడి పోలీసులు పట్టుకుని విచారించారు. దొంగ నోట్లను పాల్వంచలో ముద్రిస్తున్నట్లుగా ఆ నిందితులు చెప్పారు. పాల్వంచ పట్టణానికి చెందిన పొదిల మురళి అనే వ్యక్తి ఇంటి వద్ద దొంగ నోట్లను ముద్రిస్తున్నట్లు వారు బయటపెట్టారు.
మురళితోపాటు పాల్వంచకే చెందిన జంగం శ్రీనివాస్, కఠారి సామ్రాజ్యం, గౌడుగొళ్ల కిరణ్కుమార్, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొనకాళ్ల చిట్టిబాబు, ఆశ్వారావుపేట మండలం అచ్చుతాపురానికి చెందిన పాకనాటి నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్కు చెందిన పసుపులేటి ఉమేష్చంద్ర, ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన వేముల పుల్లారావు ముఠాగా ఏర్పడి ఈ దొంగ నోట్లను చలామణీ చేస్తున్నారు. వీరంతా పాల్వంచలోని పొదిలి మురళి ఇంటి వద్ద దొంగ నోట్లను ముద్రిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చుకు గౌడుగోళ్ల కిరణ్కుమార్ పెట్టుబడి పెట్టాడు. ముద్రించిన దొంగనోట్లను పొదిలి మురళి, కఠారి సామ్రాజ్యం (మహిళ), పాకనాటి నాగేశ్వరావు, పసుపులేటి ఉమేష్చంద్ర, పొదిలి శ్రీనవాస్ కలిసి పాల్వంచతోపాటు భద్రాచలం, ఏపీలోని ఎటపాక, నెల్లిపాక, వీఆర్పురం, రేఖపల్లి, కూనవరం, చింతూరు, కుంట తదితర ప్రాంతాల్లో చలామణీ చేస్తున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- bust
- counterfeit
- Currency
- gang
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

