బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగిస్తున్నది. తన తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతును ఎక్కడికక్కడ నొక్కేయాలని చూస్తున్నట్లు కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించింది. తప్పులతడకగా ఉన్న బీసీ కులగణన సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. దీనిని జీర్ణించుకోలేని రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ను గొంతెత్తకుండా చేయాలని భావించింది. అందులో భాగంగానే మంగళవారం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను, అందులో జరిగే బీసీ కులగణన చర్చను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని అనుమానించింది. బీసీ కులగణనను ఆమోదించుకునే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీని ముట్టడిస్తారేమోనని తరలించింది.
ఈ అనుమానంతోనే భద్రాద్రి జిల్లా పోలీసులకు సోమవారం రాత్రే ఆదేశాలు పంపింది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే కట్టడి చేయాలని సంకేతాలిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు వెళ్లారు. ఉన్నపళంగా వారిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్లకు తరలించారు. మంగళవారం మధ్యాహ్నానికి వారి నుంచి సంతకాలు తీసుకొని వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు.
-నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 4
పాలనా వైఫల్యమే అరెస్టులకు నిదర్శనం: బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమే తమ అక్రమ అరెస్టులకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అసెంబ్లీ ముట్టడికి తమ పార్టీ పిలుపును ఇవ్వనప్పటికీ.. అభద్రతాభావం, భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల అరెస్టులకు పూనుకుందని విమర్శించారు. తమది ప్రజాపాలనంటూ చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం.. పోలీసు పహారాలతో పాలన అందిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశిస్తోందని అన్నారు. దీంతో అరెస్టులకు కారణాలు పోలీసులకు కూడా తెలియడం లేదని, కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనావిధానం సక్రమమైతే ప్రతిపక్షానికి ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ప్రజల పక్షాన గొంతెత్తనీయకుండా ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. కాగా, బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ తదితరులు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. అయితే, అరెస్టయిన వారిలో భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఉన్నారు.