మధిర : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మధిర పట్టణ, రూరల్ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు డైరీ, క్యాలెండర్, ప్యాకెట్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలు ప్రజలకు అండగా నిలిచాయని చెప్పారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మొండితోక జయకర్, బిక్కి కృష్ణ ప్రసాద్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, కొఠారి రాఘవరావు, అబ్బూరి రామన్, బాణాల శంకరాచారి, గద్దల స్వామి, తేల కొండలరావు, కుర్ర అప్పారావు, అంతా బాబు, రాయుడు భద్రయ్య, వినుకొండ మురళీకృష్ణ, దామ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.