ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు విరామం లేకుండా ఊరూరా.. వాడవాడలా కలియతిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాలనీల్లో ఇంటింటికీ వెళుతూ మ్యానిఫెస్టోపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, ఆయనతోనే అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు.