Panchangam | కారేపల్లి, ఫిబ్రవరి 19 : కారేపల్లి, కామేపల్లి, గార్ల, రఘునాధపాలెం మండలాల అర్చక పురోహితులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాలను సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి బహుకరించారు. ఇవాళ కారేపల్లి శివాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయ విఘ్నేశ్వర అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు కొత్తలంక కైలాసశర్మకు సురేందర్ రెడ్డి ఈ పంచాంగాలను అందజేశారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా అర్చక పురోహితులకు పంచాంగాలు బహుకరిస్తున్న సురేందర్ రెడ్డిని ఈ సందర్భంగా పురోహితులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెలవల పల్లి వెంకట సురేష్ శర్మ, కార్యదర్శి గణపతి బోట్ల లక్ష్మీనారాయణ శర్మ, పురోహితులు గోదావరి భువనేశ్వరి, ఈశ్వర శాస్త్రి, కొండపల్లి శ్రీనివాస్ శర్మ, భైరవభట్ల సాయి రామశర్మ తదితరులు పాల్గొన్నారు.
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ