కూసుమంచి, మార్చి 8 : తగ్గుతున్న పాలేరు రిజర్వాయర్ నీటిమట్టాన్ని పెంచడం కోసం జిల్లాకు నీటిని నిలిపివేసిన అధికారులు తిరిగి శుక్రవారం రాత్రి నుంచి నీటిని విడుదల చేశారు. ఒక్కరోజు పూర్తిగా నీటిని నిలిపివేయడంతో 15.5 అడుగుల నుంచి 18.75 అడుగులకు పాలేరు నీటిమట్టం పెరిగింది.
వేసవి తీవ్రత, నాలుగు జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మరో నెల రోజులపాటు వరి తదితర పంటలకు నీటి అవసరాలు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌కు సాగర్ నుంచి 6,055 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. పాలేరు నుంచి 4,606 కూసెక్కుల నీటిని వదులుతున్నారు. పాలేరు చానల్‌కు 230 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు 135 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 275 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పాలేరు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోకు మధ్య 757 క్యూసెక్కుల వ్యత్యాసం ఉండడంతో మరో నాలుగు రోజుల్లో మరో అడుగు వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.