కారేపల్లి, అక్టోబర్ 07 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రామ పంచాయతీల్లో పంట పొలాలు పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వరి కొయ్యలను, పత్తి వ్యర్ధాలు మొదలగు పంటలను భూమిలో కలయదున్నకుండా కాల్చడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. వరి కొయ్యలను, పత్తి పంటకు సంబంధించిన వ్యర్థాలు కాల్చడం వల్ల భూమిలో గల సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుందని, దాని వల్ల భూమి సారవంతం కోల్పోయి పంట పండించుకోవడానికి పనికి రాకుండా పోతుందన్నారు. ఆయన వెంట ఏఓ బట్టు అశోక్ కుమార్, ఏఈఓలు ఉన్నారు.