Karepalli | అదుపుతప్పి పల్టీ కొట్టిన క్రేన్.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి..!
కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలానికి చెందిన రాజేష్ ఒక క్రేన్ డ్రైవర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రేన్‌తో పనులు ముగించుకొని తిరిగి సొంత ఊరు వెళ్తున్నాడు. ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారి గాంధీనగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర్లో ఉన్నట్టుండి క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.
అప్రమత్తమైన రాజేష్ వెంటనే కిందికి దూకగా అతనిపై క్రేన్ పడింది. క్రేన్ కింద పడిన రాజేష్‌ను కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నంచినాకీ ఫలితం లేకుండా పోయింది. సుమారు గంటపాటు ఆర్తనాదాలు చేస్తూ కొట్టుమిట్టాడుతూ రాజేష్ ప్రాణాలు వదిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్రేన్ యజమాని రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో రాజేశ్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన పడిన క్రేన్‌ను తొలగించానికి సుమారు గంటన్నరకు పైగా పట్టింది. దాంతో ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

