ఖమ్మం/తిరుమలాయపాలెం, డిసెంబర్ 24: బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో శనివారం రూరల్ తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలుకు చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలిచి అత్యధిక స్థానాలు సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి తెలంగాణ మాడల్ అభివృద్ధి సాధిస్తారన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ దీవెనల కారణంగా తన సొంత గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దక్కిందన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో చామకూరి నాగభూషణం, ఉపేందర్, వెంకటేశ్, రవి, శంకర్, లింగప్వామి, జాన్‌కుమార్, రమేశ్, నాగార్జున, నాగమణి, ఉపేందర్, వెంకట్, ప్రవీణ్, నర్సింహారావు, బాబు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాషబోయిన వీరన్న, చావా వేణు, చామకూరి రాజు, పోట్ల శ్రీను, పరికపల్లి చంద్రశేఖర్, దూదిమట్ల శ్రీనివాస్, యామకూరి వెంకట్, సిద్దయ్య, శ్రీను పాల్గొన్నారు.