తిరుమలయపాలెం. ఏప్రిల్ 24 : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలయపాలెం మండలంలోని మేకలతండా స్టేజి వద్ద గుగులోతు గణేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, దాతలు వేసవికాలం దృష్ట్యా ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల తండా సర్పంచ్ లక్ష్మీభద్ర నాయక్. ఆత్మ కమిటీ మెంబర్ జడల నగేష్, కాంగ్రెస్ యూత్ కమిటీ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ పాల్గొన్నారు.