కారేపల్లి, మే 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమీపంలో వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేలకాయలపల్లికి చెందిన పాయం వెంకట నరసయ్య (52) అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో స్థానిక సర్పంచ్, కార్యదర్శి తక్షణ సహాయం కింద మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.