హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): జూన్లో జరిగిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలో తప్పులు, లోపాలతో ఇంగ్లిష్, సోషియాలజీ, కామర్స్ పేపర్లు రద్దు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని ఏఐఎస్ఎఫ్ పేర్కొన్నది. నీట్ పేపర్ లీక్, పరీక్షల్లో అవకతవకలు మొదలుకొని నేటి యూజీసీ నెట్ ప్రశ్నప్రత్రాల తప్పులు, లోపాల వరకు పరీక్షల నిర్వహణపై ఎన్టీఏ తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
సోమవారం ప్రకటన విడుదల చేశారు. వరుస వైఫల్యాలతో ఎన్టీఏలో జరుగుతున్న అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.