అశ్వారావుపేట, డిసెంబర్ 2: ఆయిల్‌పాం గెలల ధర నవంబర్ నెలకు స్వల్పంగా తగ్గింది. అక్టోబర్ నెలకు గాను టన్ను గెలల ధర రూ.19,681 ఉండగా నవంబర్ నెలకు సుమారు రూ.83 తగ్గి రూ.19,598లకు పడిపోయింది. ఈ మేరకు మంగళవారం ఆయిల్‌ఫెడ్ అధికారులు హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఓఈఆర్ పెరిగినప్పటికీ గెలల ధర పడిపోవటం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గెలల ధర నిర్ణయంలో అధికారులు జిమ్మిక్కులు చేస్తున్నారేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెల ధర రూ.19,598లుగా నిర్ణయించినట్లు ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్‌రెడ్డి ధ్రువీకరించారు.