కారేపల్లి, నవంబర్ 27 : సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సంబంధించి 41 సర్పంచ్, 356 వార్డు సభ్యులు నామినేషన్లు 13 కేంద్రాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సింగరేణి, అప్పాయిగూడెం గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు సింగరేణి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. అలాగే గేటుకారేపల్లి, రేగులగూడెం, దుబ్బతండా పంచాయతీల నామినేషన్లు గేటుకారేపల్లి జీపీ కార్యాలయం, కొత్తకమలాపురం, పాతకమలాపురం, గంగారంతండాకు చెందిన నామినేషన్లు కొత్తకమలాపురం పంచాయతీ కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందన్నారు. పేరుపల్లి, సూర్యతండా, రావోజీతండా గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ పేరుపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉంటుందన్నారు. మాధారం, కొత్తతండా, గుంపెళ్లగూడెం, మంగళితండా జీపీల నామినేషన్లు మాధారం జీపీ కార్యాలయంలో తీసుకుంటారన్నారు.
భాగ్యనగర్తండా, గుట్టకిందిగుంపు, పోలంపల్లి గ్రామ పంచాయతీల నామినేషన్లు భాగ్యనగర్తండా జీపీ కార్యాలయం, సీతారాంపురం, ఉసిరికాయలపల్లి, చిన్నమడెంపల్లి, తొడితలగూడెం జీపీల నామినేషన్లు సీతారాంపురం జీపీ కార్యాలయంలో స్వీకరించటం జరుగుతుందన్నారు. కోమట్లగూడెం, గాదెపాడు, కొమ్ముగూడెం జీపీల నామినేషన్లు కోమట్లగూడెం జీపీ ఆఫీస్లో, మాణిక్యారం, ఎర్రబోడు, మొట్లగూడెం జీపీల నామినేషన్లు మాణిక్యారం జీపీ కార్యాలయంలో స్వీకరించనున్నారు. విశ్వనాధపల్లి జీపీ కార్యాలయంలో విశ్వనాధపల్లి, భజ్యాతండా, గిద్దవారిగూడెం, వెంకిట్యాతండాల నామినేషన్లు, రేలకాయలపల్లి జీపీ కార్యాలయలో రేలకాయలపల్లి, జైత్రాంతండా, గేటురేలకాయలపల్లి నామినేషన్లు తీసుకోవటం జరుగుతుందన్నారు. చీమలపాడులో జీపీ ఆఫీస్లో చీమలపాడు, నానునగర్తండా, బోటితండాకి చెందిన నామినేషన్లు, బాజుమల్లాయిగూడెం జీపీలో బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, టేకులగూడెం జీపీల నామినేషన్లు తీసుకుంటారని ఎంపీడీఓ తెలిపారు.