ఖమ్మం, డిసెంబర్ 30: తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, సామాజిక, విద్యావేత్తలు పుష్పగుచ్ఛాలు, శాలువలు తీసుకురావొద్దని, విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్, స్టేషనరీ సామగ్రి, స్కూల్ బ్యాగ్స్ తీసుకురావాలని మంత్రి అజయ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సామగ్రిని నిరుపేద విద్యార్థులకు అందజేస్తామన్నారు.