ఉడకని అన్నం, నీళ్లచారు మాకొద్దు..
ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు చేశారు.
- ఖమ్మంలో ఎన్నెస్పీ క్యాంపు స్కూల్ విద్యార్థుల ఆందోళన
- నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని డీఈవో హామీ
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 28: ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు చేశారు. దీనికి పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలపడంతో సుమారు 2 గంటలపాటు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు.
వివరాలు తెలుసుకున్న డీఈవో సోమశేఖర శర్మ పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులను మందలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ భోజనం వండించి విద్యార్థులకు వడ్డించడంతో వారు శాంతించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ బడి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అధికారులు పర్యవేక్షించి నాణ్యమైన భోజనం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

