ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసిన మూడు ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అందించింది. గురువారం సాయంత్రం మార్కెట్కు చేరిన యంత్రాల పనితీరును చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న పరిశీలించారు.