రఘునాథపాలెం, ఫిబ్రవరి 10: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోదరుడు ఉదయ్‌కుమార్ తనయుడు నరేన్రాజ్ – సాయి షిరిణి వివాహ రిసెప్సన్ వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. నగరంలోని మమత కళాశాలలో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, అధికారులు, పలు పార్టీల నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తొలుత సర్వమతాలకు చెందిన మతపెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, సీపీ విష్ణు ఎస్ వారియర్, ఎస్పీ వినీత్ తదతర ప్రముఖులు పాల్గొని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నవ దంపతులను ఆశీర్వదించారు.