మధిర, జనవరి 12: అసెంబ్లీ ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ప్రజలకు పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులు.. అమలుకు నోచుకోక బాకీ కార్డులుగా మిగిలిపోయాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర పట్టణంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అబద్ధపు, మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం బాకీపడ్డ హామీల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాకీపడ్డ హామీలను ముందుగా తీర్చిన తర్వాతే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగాలని, ఆ విధంగా ప్రశ్నించేలా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మధిర మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులను ఆయన ఉత్సాహపరిచారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.
మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హకు ఉందని వారు అన్నారు. భట్టికి మధిర మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పల్లబోతు వెంకటేశ్వరావు, అరిగే శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మొండితోక లతా జయాకర్, నాయకులు రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్‌రెడ్డి, బికి కృష్ణప్రసాద్, చిత్తూరు నాగేశ్వరావు, రంగిశెట్టి కోటేశ్వరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, చావా వేణు, వాసిరెడ్డి నాగేశ్వరావు, ఐలూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, జగన్మోహన్రావు, మాజీ కౌన్సిలర్లు వైవీ అప్పారావు, మాధవి, ప్యారి, ఇక్బాల్, రాఘవరావు, సీతారామయ్య, వెంకటనారాయణ, నాగబాబు, కోన నరేందర్‌రెడ్డి, అబ్బూరి రామన్, పరిసా శ్రీనివాసరావు, ఆతూర్ సర్పంచ్ స్వాతి, అబ్దుల్ ఖురేషి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.