మధిర : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు. రైల్వేస్టేషన్ మూసివేత వలన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఈ ప్రాంత ప్రజలు రైల్వే ఉన్నత అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుకెళ్లారు.
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు శనివారం రైల్వే ఉన్నత అధికారులు రైల్వే స్టేషన్ ఎత్తివేతను నిలిపివేస్తూ జీవో జారీచేశారు. వారి ఆదేశాల మేరకు ఖమ్మం రైల్వే కమర్షియల్ డిపార్టుమెంట్ అధికారి శ్రీనివాసులు ఆదివారం రైల్వేస్టేషన్‌ను పునఃప్రారంభిచారు. ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ క్లర్క్‌గా శేష్ కుమారిని నియమించారు.
విజయవాడ-భద్రాచలం రోడ్డు, డోర్నకల్-విజయవాడ వెళ్లు ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తేలుకుంట్ల శ్రీనివాస్, పరిటాల యలమంద, కోపూరి నవీన్, ఆలస్యం బసవయ్య, బొర్రా ప్రసాద్, కొల్లి బాబు, అంబటి శాంతయ్య, వేణు వివిధ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.