కారేపల్లి, ఆగస్టు 09 : గిరిజన చట్టాలు, హక్కులపై గిరిజన యువత తప్పక అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో ఆదివాసి గిరిజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించుకోవాలన్నారు. ఆదివాసులు పండించిన అటవీ ఉత్పత్తులు, వైవిద్యం పెంపొందించడానికి ప్రభుత్వం గ్రామాల్లోని గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు కల్పించాలన్నారు.
అంతకుముందు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గల కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమరం భీమ్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఆదివాసి గిరిజనులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు, వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ఆదివాసీలు పాల్గొన్నారు.
Karepalli : గిరిజన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య