మధిర, ఆగస్టు 23 : వయో వృద్ధుల సంరక్షణ సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. శనివారం మధిర మండల న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వయో వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణార్ధం అమలులో ఉన్న చట్టాలను తెలుసుకోవాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అవలంబించాల్సిన చట్ట బద్ధమైన మార్గాలు వివరించారు.
అవసరమైనప్పుడు కోర్టు ఆవరణలో గల ‘న్యాయ సేవా సంస్థ’ వారి సహకారం ఉచితంగా పొందవచ్చు అని తెలిపారు. అనంతరం న్యాయమూర్తిని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ బాధ్యులు శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ మండల అధ్యక్షుడు పారుపల్లి వెంకటేశ్వరరావు, తెలంగాణ వయో వృద్ధుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవరపు నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది చావలి రామరాజు, రిటైర్డ్ ఉద్యోగులు, న్యాయ సేవా సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు.