కారేపల్లి, నవంబర్ 21 : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కారేపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి పెద్ద చెరువు వద్ద ముదిరాజ్ సంఘం జెండాను ఎగరవేసి ఆక్కడి నుండి మోటర్ సైకిల్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సింగరేణి మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు తురక సాంబయ్య ముదిరాజ్, పేరుపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బుడిగ సత్యనారాయణ మాట్లాడుతూ.. చేపల వేట వృత్తిగా జీవిస్తున్న ముదిరాజ్‌లకు ఏజెన్సీలో మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ఉచిత చేప పిల్లల పంపిణీ బదులు నగదు బదిలీ చేయాలన్నారు. ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి సమస్యలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు తురక నారాయణ, రామకోటి, గంగరబోయిన సత్యం, పెద్దమ్మ సత్యనారాయణ, చింతల సంపత్, గొడుగు శ్రీను, అక్కుల రామకృష్ణ, తురక రవి, మల్లేశ్ పాల్గొన్నారు.