
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామానికి చెందిన యాదా లావణ్య ఉత్తమ యువ పార్లమెంటేరియన్‌గా ఎంపిక కావడంతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావులతో కలసి శాలువా బోకేలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చదువులోనూ, డిబేట్‌లోని రాణిస్తూ సొంత గ్రామానికీ, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, మండల నాయకులు మంకెన రమేశ్, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, కాళంగి డేవిడ్, తునికిపాటి పూర్ణచంద్రరావు, కళావతి తదితరులు పాల్గొన్నారు.