ఖమ్మం/ వైరా రూరల్, అక్టోబర్ 17: వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరెన్ని మాయమాటలు మాట్లాడినా వైరాతో సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరమూ సమష్టిగా కదలి మదన్‌లాల్‌ను మంచి మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు.
పటిష్టమైన నాయకత్వం, బలం మనకు ఉన్నాయని, రేయింబవళ్లూ కష్టించి పనిచేస్తే మదన్‌లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రజలందరికీ విశదీకరించాలని పిలుపునిచ్చారు. వైరాలో మంచి మెజార్టీ తెచ్చుకుంటేనే సీఎం వద్ద మనందరి గౌరవమూ నిలబడుతుందని అన్నారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైరారూరల్, అక్టోబర్17 : వైరా మండలం గరికపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్ జిల్లా నాయకులు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ గెలుపు ధ్యేయంగా అందరం కలిసి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అయిలూరి శ్రీనివాసరెడ్డి, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, కోట సందీప్, తేళ్లూరి నాగరాజు, మాతంగి శ్రీను, జిల్లా నర్సింహారావు, పంతంగి శ్రీను, తిరుపతిరావు, తిరుమలగిరి శ్రీను, కొరకొప్పు ఏసు, సుంకర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.