శ్రీరాంపూర్, నవంబర్ 10: సింగరేణి కార్మికులకు కేసీఆర్ పాలనలోనే మేలు జరిగిందని మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ ఏరియా 3వార్డు ఆర్కే 6కాలనీ, కృష్ణాకాలనీ, కుర్ము వాడలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, కౌ న్సిలర్ పంబాల గంగాఎర్రయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంటింటా, వాడవాడలో తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాడల్లో మహిళలు ఎమ్మెల్యేకు హారతులు పట్టారు. విజయం మీదే అంటూ దీవించారు. ఈ సందర్భంగా అభ్యర్థి దివాకర్‌రావు మాట్లాడుతూ గత ప దేళ్లలో కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించారన్నారు. కారుణ్య ఉద్యోగాలతో కార్మిక కు టుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. 16 శాతం లాభా ల వాటాను 32 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కారుణ్య ఉద్యోగం సాధించిన యువకులు ఓటు ద్వారా కృతజ్ఞత చాటుకోవాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే రైతులకు కరెంటు కోతలు, సింగరేణి గనుల ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు. దీంతో రైతులు, కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ బెడిక లక్ష్మి, పూదరి కు మార్, బౌతు లక్ష్మి, చీడం మహేశ్, వంగ తిరుపతి, ప్రకాశ్‌రెడ్డి, బేర సత్యనారాయణ, బోయ మల్లయ్య, నాసర్, అన్నపూర్ణ, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మహిళా అధ్యక్షురాలు రౌతు రజిత, వార్డు అధ్యక్షుడు జక్కుల కుమార్, మాజీ సర్పంచులు కమలాకర్‌రావు, మల్లెత్తుల రాజేంద్రపా ణి, మాజీ ఎంపీటీసీ వేల్పుల రవీందర్, నాయకులు రమేశ్, శ్రీనివాస్, పత్తి వెంకటేశ్, జ్యోతి, రామస్వామి, కాటం రా జు, కాశీరావు, బండి తిరుపతి, తిరుపతమ్మ, దగ్గుల మధు, స్వప్న, వెంకటమ్మ, విమల, శ్రీలత పాల్గొన్నారు.