భద్రాచలం, ఫిబ్రవరి 3: భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం దర్శించుకున్నారు. ధ్వజ స్థంభం వద్ద నమస్కరించుకుని అంతరాలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారమ్మ సన్నిధిలో వారికి అర్చకులు వేదాశీర్వచనం, ప్రసాదాలు, శేష వస్ర్తాలను అందజేశారు. సత్తుపల్లి, పినపాక మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, టీఎస్ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.