సైన్స్‌తోనే మానవాళి భవిష్యత్తు
సైన్స్‌తోనే మానవాళికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల స్కూల్లో గురువారం ఆమె జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.
- ఎమ్మెల్యే హరిప్రియానాయక్
ఇల్లెందు రూరల్, నవంబర్ 24: సైన్స్‌తోనే మానవాళికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల స్కూల్లో గురువారం ఆమె జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. సింగరేణి ఏరియా జీఎం శాలెంరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశామన్నారు. 239 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ప్రదర్శనకు ప్రాజెక్ట్‌లు తీసుకువచ్చారన్నారు. శుక్ర, శనివారాల్లోనూ ప్రదర్శన కొనసాగుతుందన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్‌నాయక్ మాట్లాడుతూ.. సైన్స్, గణితం ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయన్నారు. సైన్స్ ఫెయిర్‌కు వచ్చే విద్యార్థులకు వసతి, భోజనం అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా సైన్స్‌ఫెయిర్ అధికారి చలపతిరావు, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తిప్పర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

