చెన్నై, ఆగస్టు 7: మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంపై జరుగుతున్న ఊహాగానాలకు తమిళనాడులోని డీఎంకే తెరదించింది. కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయంతో ఇండియా కూటమి నుంచి విడిపోయిన క్రమంలో ఈ బిల్లుపై డీఎంకే తన వైఖరిని మార్చుకుంటుందన్న వదంతులను కొట్టివేసింది.
తమ పార్టీ మొదటి నుంచి నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నదని, ఇక ముందు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటుందని మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.