ఖమ్మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
- నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తా..
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం, మార్చి 15: ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఖమ్మంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2, 5, 8, 27, 49, 57 డివిజన్లలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, 15వ డివిజన్లో రూ.2.50 కోట్లతో చేపట్టిన ఖమ్మం – కొదుమూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
అనంతరం వికలాంగుల కాలనీ వద్ద నగరపాలక సంస్థ సిబ్బందికి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని, పనులను నాణ్యంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, శ్యామ్‌ప్రసాద్, చంద్రమౌళి, రంజిత్, కృష్ణలాల్, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, రావూరి కరుణ సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

