మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు పూర్తి చేయాలి
మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
- ప్రాజెక్ట్‌పై మంత్రులు తుమ్మల,పొంగులేటి, తుమ్మల ఉన్నతస్థాయి సమీక్ష
ఖమ్మం, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా రిజర్వాయర్, లంకాసాగర్ చెరువు, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఏనూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి, పనులు మొదలుపెట్టాలన్నారు. యాతాలకుంటలో భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్‌కు ఈ సీజన్లో సాగునీరు ఇవ్వొచ్చన్నారు. సత్తుపల్లి కెనాల్‌కు సంబంధించి భూసేకరణకు రూ.12 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలేరు టన్నెల్ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్‌కూ జలాలు తీసుకురావొచ్చన్నారు.
తాగునీటి అవసరాలపైనా సమీక్ష..
కూసుమంచి, జనవరి 7: తగ్గిన పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం, సాగర్ జలాల రాక, రిజర్వాయర్‌పై ఆధారపడిన తాగునీటి అవసరాలపై హైదరాబాద్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావుతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రస్తుతం సాగర్‌లో ఫిబ్రవరి మొదటి వారం వరకు మాత్రమే జలాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు చేశారు. మిషన్ భగీరథకు నీటికొరత లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఖమ్మం చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

