రఘునాథపాలెం, జూలై 20: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. వరద ఉధృతి తగ్గేంత వరకు భద్రాచలంలోనే మకాం వేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచించారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ఉదయం 11 గంటలకు పట్టణం చేరుకోనున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయనున్నారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి పరిస్థితులను సమీక్షించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించనున్నారు.