ఖమ్మం, అక్టోబర్ 6: దాదాపు రూ.3 వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీతో అందించి ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తోడ్పాటునివ్వాలని కోరారు. నగరంలోని 41వ డివిజన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధి కోసమే అహర్నిశలు పనిచేశానని అన్నారు. ఇకముందు కూడా అలాగే చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు ప్రతి గల్లీలోనూ సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. గడచిన 65 ఏళ్లుగా ఖమ్మాన్ని పాలించిన నాయకులు కనీసం రూ.100 కోట్ల నిధులైనా తేలేదని విమర్శించారు.
తాను మాత్రం రూ.3 వేల కోట్లతో ఖమ్మాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. అభివృద్ధిలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల నియోజకవర్గాల తరువాత ఖమ్మానిదే తరువాతి స్థానమని స్పష్టం చేశారు. అందుకని పార్టీలకు అతీతంగా ఇక్కడి ప్రజలు తనను ఆశీర్వదించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన ప్రజలందరికీ తెలుసునని, వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే నమ్ముకున్నారని అన్నారు. అజయ్ తెలుప నిర్ధారణ అయిందని, ఇంకా అత్యధిక మెజార్టీ సాధించాలని అన్నారు. అనంతరం పారా నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. పారా నాగేశ్వర రావు అధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, వివిధ సంఘాల నాయకులు పునుకొల్లు నీరజ, కర్నాటి కృష్ణ, పారా శ్రీనివాస్, బచ్చు విజయ్‌కుమార్, కొప్పు నరేశ్‌కుమార్, జాబిశెట్టి శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, రామిశెట్టి రమేశ్, ఆర్వీఎస్ సాగర్, గౌతమ్బాబా పాల్గొన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 6: తెలంగాణలోనే కుల వృత్తులకు ప్రోత్సాహం లభిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని, కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తోందని అన్నారు. ఖమ్మం నగరంలోని శుక్రవారం పర్యటించిన ఆయన.. భక్తరామదాసు కళాక్షేత్రంలో 300 మంది బీసీలు, వృత్తిదారులకు రూ.3 కోట్ల విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. అంతరించి పోతున్న కులవృత్తులకు జీవం పోయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారని వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం రుణం కాదని, గ్రాంట్ అని మంత్రి వివరించారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షాన వృత్తిదారులందరూ నిలవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఫాతిమా, దోరేపల్లి శ్వేత, బచ్చు విజయ్‌కుమార్, జ్యోతి, పాలెపు విజయ వెంకటరమణ, మక్బూల్, బుర్రి వెంకట్‌కుమార్, గజ్జెల లక్ష్మి, దోన్వాన్ సరస్వతి, ముకాల కమల, పసుమర్తి రామ్మోహన్, పాకాలపాటి విజయనిర్మల, రావూరి కరుణ, బుడిగం శ్రీనివాస్, దాదే అమృతమ్మ, చిరుమామిళ్ల లక్ష్మి, దండా జ్యోతిరెడ్డి, ఆళ్ల నిరీశారెడ్డి,మందడపు లక్ష్మి, దనాల రాధ, కూరాకుల వలరాజు, మోతారపు శ్రావణి, ప్రియాంక, గుత్తా రవి, మాదంశెట్టి హరిప్రసాద్, రామారావు, ప్రదీప్ పాల్గొన్నారు.