ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్కు ఎదురులేదు
రానున్న ఎన్నికల్లో మధిరలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీయే అని, అకడ గెలిచేది లింగాల కమల్‌రాజు అని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజంగా వారు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని.. అసలు ఏమైనా చేస్తే కదా చెప్పుకోవడానికి అని అన్నారు.
- మధిర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి అజయ్
ఖమ్మం, అక్టోబర్ 26: రానున్న ఎన్నికల్లో మధిరలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీయే అని, అకడ గెలిచేది లింగాల కమల్‌రాజు అని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజంగా వారు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని.. అసలు ఏమైనా చేస్తే కదా చెప్పుకోవడానికి అని అన్నారు. గురువారం మధిర నియోజకవర్గ స్థాయి సమావేశం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అధ్యక్షతన ఖమ్మం నగరంలోని మంత్రి పువ్వాడ నివాసంలో జరిగింది. మధిర, ఎర్రుపాలెం బోనకల్, చింతకాని, మధిర టౌన్, ముదిగొండ, మధిర రూరల్ మండల నాయకులను ఉద్దేశించి మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడారు. మధిర నియోజకవర్గ నాయకత్వం అద్భుతంగా ఉన్నదని, స్థానిక ఎమ్మెల్యే లేకున్నా అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. నన్ను మంత్రిగా పిలవలేని వాడు.. రాజ్యాంగ బద్దంగా క్యాబినెట్ మంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేని వ్యక్తి అన్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, పి .పుల్లయ్య, మల్లాది వాసు, గుర్రం రామారావు, చావా రామకృష్ణ, బంధం శ్రీనివాస్, శీలం వెంకట్‌రెడ్డి, కరివేద వేంకటేశ్వర రావు, వల్లపోతుల వెంకటేశ్వర్లు, పంబి సంబాశివరావు, లక్ష్మిరెడ్డి, మొండితోక జయకర్, బంక మల్లయ్య, శ్రీనివాస్ రావు, మల్లికార్జున్ పాల్గొన్నారు.
పలువురు ప్రముఖులను కలిసిన మంత్రి
ఖమ్మం, అక్టోబర్ 26: ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ అభిమానులు, పలువురు పుర ప్రముఖులు చావా వెంకటేశ్వరరావు దంపతులు, రావి రామారావు, లక్ష్మణమూర్తి, రిటైర్డ్ ఈఈ చంద్రశేఖర్, గ్రానైట్ గోపి, బోడేపుడి నాగేశ్వరరావును వీడీయోస్ కాలనీ నందు మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట కాటా సత్యనారాయణ బాబ్జీ, పోట్ల శ్రీకాంత్, బత్తుల మురళీ ఉన్నారు.
‘గుర్రం’ కుటుంబాలను కలిసిన మంత్రి
నగరంలోని ప్రముఖ మాల్ జీవీ మాల్ అదినేత గుర్రం ఉమామహేశ్వరరావు, వారి సోదరులు గుర్రం నర్సింహారావు, గుర్రం అశోక్‌కుమార్ కుటుంబాలను బీఆర్ఎస్ ఖమ్మం నియెజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. రానున్న ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు తెలిపి తనను గెలిపించాలని కోరారు.
మున్నీ మృతికి నివాళి
రఘునాథపాలెం, అక్టోబర్ 26: మండల పరిధిలోని బూడిదంపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కేళోతు బాసు తల్లి మున్నీ గురువారం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలిసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మృతురాలి ఇంటికి వెళ్లి పూలమాల వేసి నివాళి అర్పించారు. నర్సింహారావు, సర్పంచ్ షేక్ మీరా సాహెబ్, వెంకటప్పారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

