ఖమ్మం:దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వేడుకున్నారు. ఖమ్మం నగరం త్రీ టౌన్లో శ్రీ హరి హర నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజకు మంత్రి పువ్వాడ ముఖ్యఅతిధిగా హాజరై పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామివారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. పూజ అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ విజయ్, నాయకులు రుద్రాగాని ఉపేందర్, వల్లెపు ఉపేందర్ స్వామి తదితరులు ఉన్నారు.