ఖమ్మం, ఏప్రిల్ 19: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి, తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్‌లతో కలిసి మొకలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఅర్ ముందుచూపుతో హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మొక్కలు పెంచడం ద్వారా ముందుతరాలకు ప్రాణ వాయువును వారసత్వంగా ఇచ్చినట్లవుతుందని అన్నారు.
ఇలాంటి కార్యక్రమం ఎంతో గొప్పదని అన్నారు. దాని కొనసాగింపుగా ఎంపీ సంతోశ్‌కుమార్.. కేసీఅర్ ఆశయ సాధనను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని అన్నారు. ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒకరూ ప్రకృతిని పరిరక్షించాలని, వీలైనన్ని ఎక్కువ మొకలు నాటాలని కోరారు. మొకల వల్ల ప్రతి ఒకరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఎంపీ సంతోశ్‌కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా పాల్గొని మొకలు నాటడం సంతోషంగా ఉందని మంత్రి అజయ్ పేర్కొన్నారు.