ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకొని అక్కడి రోడ్ షోలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఇల్లెందు, మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తగూడెం, సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకొని రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం నేరుగా భద్రాచలం పట్టణానికి చేరుకుంటారు. 11 గంటలకు శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకుంటారు.
అనంతరం బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయాన్ని ఆకంక్షిస్తూ పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంత చేయాలని ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ శ్రేణులకు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.