ఖమ్మం, సెఫ్టెంబర్ 27: పర్యావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను పూజించిన వారంతా అభినందనీయులని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఉత్సవ కమిటీలు తీసుకున్న చొరవ ఎంతో గొప్పదని అభివర్ణించారు. ప్రశాంతమైన వాతావరణానికి ఖమ్మం నగరం మారుపేరుగా నిలుస్తోందని అన్నారు. అన్ని పండుగలనూ ఘనంగా జరుపుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా ఖమ్మంలో చేపట్టిన శోభాయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. సార్వత్రిక నిమజ్జనం కోసం తొలుత త్రీటౌన్ గాంధీచౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథులను యా త్రను ప్రారంభిస్తూ జెండా ఊపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఅర్ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రం గంగ జమున తేహాజీబ్ లా అన్ని మతాలు అన్నదమ్ము ల వలే కలిసి ఉండేలా ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రోత్సహించి, పూజించాలనే ఆకాంక్షతోనే స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన మట్టి వినాయక మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ తరఫున విద్యుత్ చార్జీలు, పోలీస్ పర్మిషన్లకు రూ.4 లక్షలు చెల్లించామని అన్నారు. వచ్చే ఏడాది నుండి పూర్తిస్థాయిలో మ ట్టి వినాయకులనే ప్రతిష్ఠించి ఆరాధించాలని విజ్ఞప్తి చేశారు. కా ల్వఒడ్డులో వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీరు, మజ్జిగ పంపిణీ కేం ద్రాలను కూడా మంత్రి ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంత రం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖ మ్మం గణేశ్ నిమజ్జనోత్సవ కమిటీకి ఎంతో చరిత్ర ఉందని అ న్నారు.
ఖమ్మం గణేశ్ ఉత్సవ క మిటీ ఎన్నో ఏళ్లుగా కులమతాలకు, పార్టీలకు అతీతంగా వినాయక ఉత్సవాలను, నిమజ్జనోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉత్సవ కమిటీల బాధ్యులు నల్లమల వేంకటేశ్వరరావు, కృష్ణ, వినోద్ లహోటి, గెంట్యాల విద్యాసాగర్, కన్నం ప్రసన్నకృ ష్ణ, బాణాల వెంకటేశ్వరరావు, సుధాకర్‌చారి, చిత్తారు సింహాద్రియాదవ్, మోరంపూడి ప్రసాద్, పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్, కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.