
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర కార్పోరేషన్ మేయర్ పీ నీరజతో కలిసి మంత్రి వ్యవసాయ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా చైర్మన్ డీ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలిసి మార్కెట్‌పై సమీక్ష చేశారు. మార్కెట్‌కు సంబంధించిన చిత్రం(నక్షా) ఆదారంగా యార్డుల పరిస్థితి, రాబోయే సీజన్‌కు సన్నధ్దం అవుతున్న తీరుపై ఆరా తీశారు.
పత్తి, అపరాలు, మిర్చి యార్డుల వైశాల్యం, ఆయా యార్డులకు వస్తున్న పంట ఉత్పత్తులు తదితర అంశాలను మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం మంత్రికి విరించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ పాలకవర్గం బాధ్యులు, సంబంధిత అధికారులకు ఆయా పనుల పురోగతిపై దిశా నిర్థేశం చేశారు. మార్కెట్ యార్డులలో సరిపడ మరుగుదొడ్లు, యార్డుల వెలుపల ప్రత్యేకంగా సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలతో పాటు, మిర్చియార్డులో ఉన్నటువంటి పురాతన భూసారా పరిక్షా కేంద్రం, పాత ఆఫీస్ కార్యాలయం, రైతు విశ్రాంతి భవనాలు తొలగింపుకు సంబంధించిన ప్రతి పాదనలు సిద్దం చేయాలని మార్కెటింగ్‌శాఖ డీఈ సమా