సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్
పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
- ఖమ్మంలో రూ.500 కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చాం
- 5 వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే
- ఎన్నికల్లో నాకు అధిక మెజార్టీ ఇవ్వాలి.. కేసీఆర్‌ను సీఎం చేయాలి
- గృహలక్ష్మి పత్రాలు, ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి అజయ్‌కుమార్
ఖమ్మం, సెప్టెంబర్ 29: ‘పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని జీవో 58, 59 కింద పేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలను, గృహలక్ష్మి కింద పేదలకు మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో నిరుపేదలకు రూ.500 కోట్ల విలువైన స్థలాలను అందజేశామని, స్వాతంత్య్రం వచ్చాక ఒకేసారి 5 వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని స్పష్టం చేశారు. పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఖమ్మాన్ని తీర్చిదిద్దిన తనకు ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీ అందించాలని కోరారు. ఖమ్మం నగరంలోని జీవో 58, 59 కింద పేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలను, గృహలక్ష్మి కింద పేదలకు మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
గృహలక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, తాజాగా 4, 5, 6, 7, 8, 9, 10, 14, 16, 22, 26, 31, 32, 36, 37, 39, 40, 41, 50, 58 డివిజన్ల లబ్ధిదారులకు అందజేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు గణేశ్, స్వామి, కర్నాటి కృష్ణ, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, కూరాకుల వలరాజు, రాపర్తి శరత్, పల్లా రోజ్లీనా, మడూరి ప్రసాద్, మేడారపు వెంకటేశ్వర్లు, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

