ఖమ్మం, అక్టోబర్ 22: “మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన రాజకీయ హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మంలో రౌడీయిజానికి తెరలేపారు. ఎంతోమంది రౌడీషీటర్లను కాపాడారు. ఎన్టీఆర్ వంటి మంచి నేతకు చంద్రబాబుతో కలిసి తుమ్మల వెన్నుపోటు పోడిచారు. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. చంద్రబాబుతో అంటకాగి ఎంతోమంది రాజకీయ నాయకుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంచన చేరారు. పదవులు అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మలా ఇదా.. మీ నిజాయతీ..? ఇదా మీ నిబద్ధత..?’ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం బీఆర్టీయూ (టాటూ) రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మల కేవలం రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్టీయూ (టాటూ) రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, జిల్లా అధ్యక్షుడు పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరి ఉమామహేశ్, దుర్గాప్రసాద్ గుప్తా, జానీ, మైసా ఆంజనేయులు, సలీం, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, గుంటి శ్రీను, కుకల రామకృష్ణ, రాంబాబు, పాపయ్య, ముల్లర్, బాలకృష్ణ, సలీం, సాయిబాబా, పాషా పాల్గొన్నారు.