ఖమ్మం, జూలై 14 : పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు, వంట బిల్లులు, పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య మాట్లాడుతూ 2023లో సమ్మె చేస్తున్న క్రమంలో రేవంత్రెడ్డి సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులందరికీ రూ.10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ.. రెండేళ్లయినా హామీ అమలు చేయలేదని మండిపడ్డారు.
ప్రభుత్వం వారానికి మూడు కోడిగుడ్లకు సరిపోను బడ్జెట్ ఇవ్వాలని, రోజుకు రెండు కూరలకు సరిపోను డబ్బులు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపేందర్, నాయకులు రాందాస్, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ నాయకులు చిర్ర రాజ్యం, రాధమ్మ, స్వప్న, సుగుణ, తిరుపతమ్మ, సుహాసిని, అరుణ, రజిని, తదితరులు పాల్గొన్నారు.