ఇల్లెందు, అక్టోబర్ 17: ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఇల్లెందు ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. భోజన పథకం నిర్వహణ బిల్లులను ఈ-కుబేర్ నుంచి మినహాయించాలని, ఐదు నెలల పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణ, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.